
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అవల్షన్ ఫ్రాక్చర్ అయ్యిందట. డాక్టర్లు మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ సూచించారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనకు కాలు ఫ్రాక్చర్ అయ్యిందని, డాక్టర్లు మూడు వారాల బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని పోస్ట్ లో రాశారు. అయితే, ఏదైనా సహాయం లేదా కమ్యూనికేషన్ కోసం తన ఆఫీస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఆమె ట్వీట్ కు నెటిజన్లు గెట్ వెల్ సూన్ అంటూ రిప్లై చేస్తున్నారు. ఫ్రాక్చర్ అయి మీరే ఇబ్బందుల్లో ఉన్నా అవసరమైనవారికి అందుబాటులో ఉంటానని పెద్ద మనసు చాటుకుంటున్నారు అక్కా.. మీరు త్వరగా కోలుకోవాలంటే మరో నెటిజన్ కోరుకున్నారు. మరికొంత మంది ఎలా జరిగిందంటూ ఆరా తీస్తున్నారు.