పీపుల్స్ మార్చ్: మధిరలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం

Published : Feb 27, 2022, 12:31 PM ISTUpdated : Feb 27, 2022, 12:45 PM IST
పీపుల్స్ మార్చ్:  మధిరలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం

సారాంశం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు పాదయాత్రను ప్రారంభించారు.  మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క 33 రోజుల పాటు యాత్ర సాగిస్తారు. 

ఖమ్మం: CLP నేత Mallu bhatti Vikramarkaఆదివారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు పాదయాత్రను ప్రారంభిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 

Madira నియోజకవర్గంలోని యడవల్లి గ్రామం నుండి భట్టి విక్రమార్క తన పాదయాత్రను ప్రారంభించారు. 33 రోజుల పాటు 135 గ్రామాల గుండా యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజల నుండి భట్టి విక్రమార్క ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలోనే భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించాలని భావించారు. కానీ Corona కారణంగా Padayatraను భట్టి విక్రమార్క వాయిదా వేసుకొన్నారు. ఇవాళ్టి నుండి ప్రారంభించిన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్  అని నామకరణం చేశారు భట్టి విక్రమార్క

ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మల్లు భట్టి విక్రమార్క యడవల్లి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి రోజూ 15 నుండి 20 కి.మీ దూరం భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా యాత్ర చేయాలని భట్టి విక్రమార్క  ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజుల ముగించిన తర్వాత  పాదయాత్రను ముగించనున్నారు. 

యడవల్లిలో పాదయాత్రను ప్రారంభించిన  సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సమస్యలు పోవాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నామన్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సమస్యలు అలాలనే ఉన్నాయని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్టుగా  భట్టి విక్రమార్క చెప్పారు. సంపద మొత్తం కొద్దిమంది పాలకుల చేతుల్లోకి వెళ్తుందన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని  భట్టి  విక్రమార్క చెప్పారు. దళిత రైతులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైందని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని  భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu