సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా... అస్వస్థతకు గురవడంతో అపోలోకు తరలింపు

By Arun Kumar PFirst Published Jan 17, 2022, 10:43 AM IST
Highlights

కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కరోనా బారిన పడగా స్వల్ప అస్వస్థతకు గురయి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా (corona virus)  కలకలం రేపుతోంది. ఇటీవల కరోనా బారినపడ్డ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) కరోనా బారినపడగ హోంఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న(ఆదివారం) స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయన అపోలో హాస్పిటల్ (appollo hospital) లో చేరారు.

అపోలో వైద్యులు భట్టి విక్రమార్కకు అన్నిరకాల వైద్య పరీక్షలు జరిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

ముందుజాగ్రత్తలో భాగంగానే భట్టి విక్రమార్కను హాస్పిటల్ లో చేర్చినట్లు తెలుస్తోంది. హాస్పిటల్ లో చేరారని ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వద్దని సూచించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులు, మధిర నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని భట్టి విక్రమార్క సూచించారు. 

తనకు కరోనా నిర్దారణకు ముందు కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు తనను కలవడానికి హైదరాబాద్ రావద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను అందర్ని కలుస్తాను అని వెల్లడించారు. 

ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (pocharam srinivas reddy) కూడా కరోనా సోకింది. ఆయన ఇదివరకే ఓసారి కరోనా బారిన పడగా తాజాగా రెండోసారి కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ఆయనకు కరోనా సోకింది. 

స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో స్పీకర్ పోచారం టెస్ట్ చేయించుకున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోయినా డాక్టర్ల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ముందుజాగ్రత్త కోసమే ఆయన హాస్పిటల్ లో చేరినట్లు... ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులెవ్వరూ ఆందోళన చెందవద్దని స్పీకర్  సూచించారు. ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు.  

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావు (keshav rao) కూడా కరోనా బారినపడ్డారు. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ (corona positive) గా నిర్దారణ అయ్యింది. అయితే కేశవరావుకు కరోనా వల్ల ఎలాంటి సమస్య లేకపోవడంతో హోంఐసోలేషన్ (home isolation) లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే వుంటూ కరోనా చికిత్స పొందుతున్నారు ఎంపీ కేశవరావు.  

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (errabelli dayakar rao) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. 

ఇక టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చేసారు. అయితే ఆయన కోవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.  

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టుగా చెప్పారు.
 
మంత్రి అవంతి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. స్వల్ఫ లక్షణాలుండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు.  తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.మరో మంత్రి కొడాలి నాని కూడా కరోనాబారిన పడగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. 

 

click me!