మిస్టరీగా మారిన Jahender Naik హత్య కేసు.. మొండెం లభించినా దొరకని ఆచూకీ.. ఆ కేసుతో సంబంధం ఉందా..?

Published : Jan 17, 2022, 10:30 AM ISTUpdated : Jan 17, 2022, 10:52 AM IST
మిస్టరీగా మారిన Jahender Naik హత్య కేసు.. మొండెం లభించినా దొరకని ఆచూకీ.. ఆ కేసుతో సంబంధం ఉందా..?

సారాంశం

నల్గొండ (Nalgonda) జిల్లాలో సంచలనం సృష్టించిన జయేందర్ నాయక్ హత్య కేసు మిస్టరీగా మారింది. వారం రోజులు గడుస్తున్న ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జైహింద్ నాయక్ మొండెం లభించినప్పటికీ.. నిందితుల ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు.

నల్గొండ (Nalgonda) జిల్లాలో సంచలనం సృష్టించిన జయేందర్ నాయక్ హత్య కేసు మిస్టరీగా మారింది. వారం రోజులు గడుస్తున్న ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జయేందర్ నాయక్ మొండెం లభించినప్పటికీ.. నిందితుల ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు మృతుడి మొండెం లభించిన భవనం యజమాని కేశ్యానాయక్‌ 2018లో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. ఆ హత్యతో.. దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ కొన్నేళ్ల కిందట కేశ్యానాయక్ కొన్నేళ్ల కిందట ఈ భవనం నిర్మాణం చేపట్టారు. అయితే 2018లో అతడు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత నుంచి భవనం విషయంలో కేశ్యానాయక్ ఇద్దరు భార్యల మధ్య గొడవ నడుస్తుంది. అయితే భవనం ఖాళీగా ఉండటంతో కేశ్యానాయక్ కొంతకాలంగాజయేందర్ నాయక్ ఉంటున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా అదే భవనంలో అతడు హత్యకు గురికావడంతో.. పోలీసులు భవనంతో సంబంధ ఉన్నవారితో పాటుగా, పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. 

ఈ నెల 10వ తేదీన నాగార్జన సాగర్-హైదరాబాద్ హైవే పక్కనే నల్గొండ జిల్లా విరాట్‌నగర్‌ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద మొండెం లేని మనిషి తల కనిపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఇది నరబలి అనే చాలా మంది అనుమానించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 

హత్యకు గురైన వ్యక్తిని సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్ గ్రామానికి చెందిన జయేందర్ నాయక్‌గా గుర్తించారు. అయితే అతనికి మతి స్థిమితం సరిగా లేదని కనుగొన్నారు. మృతుడి మొండెం ఎక్కడుందని తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని (Turkayamjal) ఓ నిర్మానుష్య భవనంలో జయేందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. 

జయేందర్ నాయక్ తల దొరికిన విరాట్ నగర్‌ మహంకాళీ అమ్మవారి ఆలయం, మొండెం లభంచిన తుర్కయాంజ‌లోని భనం.. రెండు కూడా నాగార్జునసాగర్-హైదరాబాద్‌ హైవే‌ను అనుకుని ఉన్నవే. అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 50 కి.మీ పైగా దూరం ఉంది. నిందితుడిని తొలుత హత్య చేసి అనంతరం విరాట్‌నగర్‌లోని ఆలయం వద్ద తల ఉంచారా..?, లేక విరాట్‌నగర్‌లోనే హత్య చేసి తలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి, అనంతరం మొండెంను తుర్కయాంజల్‌లోని భవనంలో పడేశారా అనేది తెలాల్సి ఉంది. ఈ క్రమంలోనే తుర్కయాంజల్ నుంచి విరాట్‌నగర్‌ మార్గంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు మిస్టరీని చేధించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. 

ఈ కేసులో నిందితులను గుర్తించడానికి రాచకొండ, నల్గొండ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. నరబలి కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే జయేందర్‌కు మతిస్థిమితం లేకపోవడం.. వంటి ఇతర కారణాల వల్ల ఈ కేసును చేధించడం‌లో ఆశించినంత స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. వారం రోజులు గడస్తున్న ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Rammohan Naidu Speech | Wings India 2026 Awards Ceremony in Hyderabad | Asianet News Telugu
Kavitha Comments on BJP: బీజేపీ భారత ప్రజలను మోసం చేస్తుంది | BC Kulaganana | Asianet News Telugu