telangana budget 2022: ప్రచారానికే తప్ప.. ఎవరికీ పనికొచ్చేది కాదు : బడ్జెట్‌పై భట్టి విక్రమార్క అసహనం

Siva Kodati |  
Published : Mar 07, 2022, 04:41 PM IST
telangana budget 2022: ప్రచారానికే తప్ప.. ఎవరికీ పనికొచ్చేది కాదు : బడ్జెట్‌పై భట్టి విక్రమార్క అసహనం

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. ప్రచారం కోసం పని చేస్తుంది తప్ప.. రైతులకు, పేదలకు పనికి వచ్చే బడ్జెట్ కాదని విక్రమార్క దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే బడ్జెట్ రూపొందించారని ఆయన అన్నారు.   

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై (telangana budget 2022) టీ.కాంగ్రెస్ (telangana congress) అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దూరంగా వున్నాయన్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే బడ్జెట్ రూపొందించారని విక్రమార్క ఆరోపించారు. బంగారు తెలంగాణ  అంటూ ప్రచారం చేసుకోవడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన మండిపడ్డారు. 

ప్రచారం కోసం పని చేస్తుంది తప్ప.. రైతులకు, పేదలకు పనికి వచ్చే బడ్జెట్ కాదని విక్రమార్క దుయ్యబట్టారు. ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ ఉపయోపడేట్టు కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు, పేదలకు పనికి వచ్చే బడ్జెట్ కాదన్న విక్రమార్క.. సబ్‌ప్లాన్ నిధులు కూడా పక్కదోవ పట్టించేలా వుందని ఆరోపించారు. మాకు మైక్ ఇవ్వమని ఎంత రిక్వెస్ట్ చేసినా స్పీకర్ తమవైపు కూడా చూడలేదని భట్టి అసహనం వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ సభలు కాదని.. చట్ట సభలంటూ చురకలు వేశారు. 

అంతకుముందు శాసనసభలో మంత్రి Minister Harish Rao బడ్జెట్ ప్రసంగాన్నిCongress MLAs బహిష్కరించారు. budget meetings నిబంధలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. Point of order కు మైక్ ఇవ్వకపోవడంమీద కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్.. సభ్యుల సభా గౌరవాన్ని పాటించడం లేదని ఆరోపించారు. స్పీకర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. 

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు (harish rao) బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు (bjp) వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు. 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు (raghunandan rao) , రాజాసింగ్ (raja singh), ఈటల రాజేందర్‌లను (etela rajender) ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఇందుకు స్పీకర్ పోచారం ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ నుంచి బైటికి వచ్చి.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ ముందుగా.. టాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా