సీఎస్ గారు.. నాతో రండి, కోవిడ్ పరిస్దితులు చూపిస్తా: సోమేశ్ కుమార్‌కు భట్టి సవాల్

By Siva KodatiFirst Published May 5, 2021, 5:01 PM IST
Highlights

తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత వుందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం రివ్యూ చేస్తున్నారని విక్రమార్క ఎద్దేవా చేశారు. ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు

తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత వుందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం రివ్యూ చేస్తున్నారని విక్రమార్క ఎద్దేవా చేశారు.

ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే విషయం ఏమైందని విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పారంటూ ఆయన దుయ్యబట్టారు.

Also Read:తెలంగాణలో లాక్‌డౌన్‌ అవసరం లేదు: సీఎస్ సోమేష్ కుమార్

ఏ ఇబ్బందులు లేవని సీఎస్ చెబుతున్నారని విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తనతో రావాలని సీఎస్‌కు సవాల్ విసిరారు. ఏ ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా వున్నాయనే సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని విక్రమార్క ప్రశ్నించారు.

ఆసుపత్రుల బయట పేషంట్లతో అంబులెన్స్‌లు క్యూలో వున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై టాస్క్‌ఫోర్స్ వేసినా ఏం లాభమని విక్రమార్క ప్రశ్నించారు. వారం వారం టాస్క్‌ఫోర్స్ రిపోర్ట్ విపక్షాలకు కూడా ఇస్తామన్నారని అది ఎంత వరకు వచ్చిందంటూ ఆయన దుయ్యబట్టారు. అసలు టాస్క్‌ఫోర్స్ ఉనికిలో వుందా అని విక్రమార్క నిలదీశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 
 

click me!