ఈ నెలలోనే లోక్‌సభ అభ్యర్థులు ప్రకటన: భట్టి

By Arun Kumar PFirst Published Feb 11, 2019, 6:55 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల విషయంలో అదిష్టానం,టిపిసిసి చివరివరకు సాగదీయడమే కారణమని కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పులు పునరావృతం కాకుండా చూడాలని వారు అదిష్టానికి సూచించారు. అయితే  ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలు కూడా దృష్టిపెట్టినట్లున్నారు. దీంతో తెలంగాణ నుండి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్ధులను ఈ నెలలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దృవీకరించారు. 

ఇవాళ గాంధీభవన్ లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయాలని భావిస్తున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల నుండి భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయని... వీటిని అదిష్టానం నియమించే కమిటీ పరిశీలించనుందన్నారు. ఆ నెలలోనే ఈ ప్రక్రియ ముగిసి నెలాఖరు వరకు అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని భట్టి వివరించారు.

లోక్‌సభ ఎన్నికల పొత్తులపై త్వరలో రాష్ట్ర నాయకులమంతా చర్చించి తమ నిర్ణయాన్ని అదిష్టానికి తెలియజేస్తామన్నారు. దాని ఆదారంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని... తుది నిర్ణయం మాత్రం  అదిష్టానందేనని భట్టి పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను లోక్ సభ ఎన్నికల్లో జరక్కుండా చూసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.     
 
click me!