శుభకార్యానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం...భార్యా భర్తల మృతి

By Arun Kumar PFirst Published Feb 11, 2019, 3:56 PM IST
Highlights

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లివస్తూ ఓ వృద్ద దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలు మృతిచెందగా మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 
 

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లివస్తూ ఓ వృద్ద దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలు మృతిచెందగా మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి(65). విజయ(60) భార్యభర్తలు. నిజామాబాద్ లో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం వుండటంతో భార్యభర్తలిద్దరు కలిసి కారులో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వీరిద్దరితో పాటు  ప్రేమల, సవిత, నిఖిల్ రెడ్డి మరో ముగ్గురు కూడా వీరి కారులోనే తిరుగు పయనమయ్యారు. 

ఈ  క్రమంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న వీరి కారు ప్రమాదానికి గురయ్యింది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని పొందూర్తి చౌరస్తా వద్ద హటాత్తుగా కారు ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారును డ్రైవ్ చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ముందు సీట్లో కూర్చున్న అతడి భార్య విజయ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యారు. 

ఈ ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందకున్న కామారెడ్డి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం  ఆస్పత్రికి తరలించారు.  అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని...వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

     

click me!