కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన సీఎల్పీ లీడర్

By Arun Kumar PFirst Published Jan 31, 2019, 3:54 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీకి వ్యతిరేకంగా అసలు ప్రతిపక్షాలే మిగలకుండా చేయాలని భావిస్తున్నారని కాంగ్రెస్ ప్లోర్ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కల్పిస్తూ ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలిపారు. కానీ ఈ కుట్రలను గుర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారని...ఏ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

ప్రభుత్వ అధికారులు కూడా ప్రజల కోసం కాకుండా సీఎం కోసం పనిచేస్తున్నారని భట్టి ఆరోపించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ వారిని వాడుకుంటున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఈ విషయంలో పోలీస్ శాఖను ఎక్కువగా వాడుకుంటున్నట్లు భట్టి విమర్శించారు. 

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఏం చేసినా అసలు ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు ప్రభుత్వ వ్యవహారశైలి కనిపిస్తోందన్నారు. గత టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షలేవీ నెరవేరలేవని...ఈసారైనా వారి ఆశలు, ఆంకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని కోరుతున్నట్లు భట్టి సూచించారు. 

తెలంగాణ ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైన ఎలక్షన్ కమీషన్ పై తమ పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 
 
click me!