విద్యార్ధిని అనుమానాస్పద మృతి... హత్యేనంటున్న విద్యార్ధి సంఘాలు

sivanagaprasad kodati |  
Published : Jan 31, 2019, 02:13 PM IST
విద్యార్ధిని అనుమానాస్పద మృతి... హత్యేనంటున్న విద్యార్ధి సంఘాలు

సారాంశం

కరీంనగర్ జిల్లా రేకుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. పట్టణంలోని అల్పోర్స్‌ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న రుచిత అనే విద్యార్థిని కాలిన గాయాలతో మరణించింది.

కరీంనగర్ జిల్లా రేకుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. పట్టణంలోని అల్పోర్స్‌ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న రుచిత అనే విద్యార్థిని కాలిన గాయాలతో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ కళాశాల వర్గాలు తల్లీదండ్రులకు సమాచారం అందించాయి. అయితే ఆమెను హత్య చేశారంటూ తోటి విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రుచిత ఒంటిపై కాలిన గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుచితను గట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారని, ఆమె మరణం వెనుక వున్న కారణంపై విచారణ జరపాలంటూ విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో నాలుగు నెలల కింద ఇదే కళాశాలలో పీఈటీగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి మరణించాడు. కాలేజీ వెనుక ప్రాంతంలో ఉణ్న తీగలు తగిలి ఆయన ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో సంచలనం కలిగించింది.  

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్