సిగరేట్ మంటనే: నుమాయిష్‌ ప్రమాదంపై ఈటల స్పందన

By sivanagaprasad KodatiFirst Published Jan 31, 2019, 12:47 PM IST
Highlights

నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణం కాదని, కాల్చి పారేసిన సిగరేట్ వల్లే ప్రమాదం జరిగిందన్నారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అగ్నిప్రమాదంపై మీడియాతో మాట్లాడిన ఈటల.. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నుమాయిష్ నిర్వహిస్తామన్నారు.

అగ్నిప్రమాదం అత్యంత బాధాకరమైనది.. వ్యాపారులతో పాటు ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. మమ్మల్ని వ్యాపార సంస్థలా డిమాండ్ చేయొద్దని తాము ప్రజల కోసం పనిచేసే సంస్థ అని ఈటల అన్నారు. ఎగ్జిబిషన్‌ను రెండు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇక నుంచి ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌కు నాలుగువైపులా నాలుగు ఫైరింజన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఈటల స్పష్టం చేశారు. షాపుకి షాపుకి మధ్య గ్యాప్ ఉండి వుంటే ఇంత ప్రమాదం సంభవించి వుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రమాదం జరిగిన చోటుకి 100 మీటర్ల దూరంలోనే ఫైరింజన్ వుందని.. వాటిలో నీరు లేదన్న వార్తలను ఆయన ఖండించారు. దేశంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారు వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు తెచ్చుకోకుండా చర్యలు తీసుకుంటామని వారికి ఎగ్జిబిషన్ ఆవరణలోనే భోజన వసతిని కల్పించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈటల అన్నారు.

ఇకపై షాపుల నిర్మాణంతో పాటు ఎగ్జిబిషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల కమిటీతో సర్వే చేయిస్తామన్నారు. అధికారులు, నేతలు బాధితులను పరామర్శించలేదన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లోనే తాను అక్కడికి వచ్చినట్లు తెలిపారు. 

click me!