కాగజ్‌నగర్‌ కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యార్థిని మృతి, బంధువుల విధ్వంసం

Siva Kodati |  
Published : Sep 07, 2022, 02:50 PM IST
కాగజ్‌నగర్‌ కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యార్థిని మృతి, బంధువుల విధ్వంసం

సారాంశం

కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనం చేసిన ఐశ్వర్య అనే విద్యార్ధిని మరణించింది. అంకుశాపూర్‌కు చెందిన ఐశ్వర్య ఇక్కడ 8వ తరగతి చదువుతుంది. విద్యార్ధికి న్యాయం చేసి, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఐశ్వర్య మృతదేహంతో విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు.

కాగజ్‌నగర్ కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్ధిని ఐశ్వర్య మృతదేహంతో విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. హాస్టల్ ఆఫీసు రూమ్‌లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆందోళనకారులు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బాధిత కుటుంబం తేల్చిచెబుతోంది. విద్యార్ధికి న్యాయం చేసి, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనం చేసిన ఐశ్వర్య అనే విద్యార్ధిని నోటి నుంచి నురగ రావడంతో పాఠశాల సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బాలిక మరణించింది. అంకుశాపూర్‌కు చెందిన ఐశ్వర్య ఇక్కడ 8వ తరగతి చదువుతుంది.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?