
హైదరాబాద్:చదువుపై శ్రద్ద పెట్టాలని మందలించినందుకు గాను హైద్రాబాద్‌లో 8th class తరగతి చదివే విద్యార్ధి అద్వైత్ కీమోతి ఆత్మహత్య చేసుకొన్నాడు.Hyderabad నల్లగండ్లలోని అపర్ణ సరోవర్ లోని 14వ అంతస్తు పై నుండి దూకి అద్వైత్ ఆత్మహత్య చేసుకొన్నాడు.చదువుకోవాలని తండ్రి మందలించడంతో 14వ అంతస్తు నుండి అద్వైత్ దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. బాలుడి మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.