స్వగ్రామాల నుండి హైద్రాబాద్‌కి 3500 బస్సులు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

By narsimha lodeFirst Published Jan 16, 2022, 6:10 PM IST
Highlights

సంక్రాంతికి స్వగ్రామాల నుండి హైద్రాబాద్ కు వచ్చేందుకు ప్రయాణీకుల కోసం 3500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టుగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. 


హైదరాబాద్: Sankranti పండుగకు స్వంత గ్రామాల నుండి Hyderabad కు తిరిగి వచ్చే వారి కోసం 3500 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టుగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ Sajjanar ప్రకటించారు.

Hyderabad నగరంలో నివసిస్తున్నవారిలో మెజారిటీ ప్రజలు Andhra pradesh రాష్ట్రంలోని తమ స్వంత గ్రామాలకు వెళ్లారు. ఇవాళ్టితో సెలవులు పూర్తయ్యాయి. ఏపీలోని స్వంత గ్రామాల నుండి హైద్రాబాద్ కు రావడానికి 3500 ప్రత్యేక Bus అందుబాటులో ఉంచామని సజ్జనార్ ప్రకటించారు. మరోవైపు 110 ప్రత్యేక trains దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.

హైద్రాబాద్ నుండి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి పర్వదినానికి వెళ్లే వారి కోసం  4 వేల ప్రత్యేక బస్సులను నడిపింది తెలంగాణ ఆర్టీసీ. ఈ నెల 14వ తేదీ వరకు 4 వేల బస్సులను వేర్వేరు ప్రాంతాల నుండి నడిపారు. తెలంగాణలోని 3,338 బస్సులు, ఏపీకి 984 బస్సులు నడిపారు. 

హైద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట లనుండి ప్రత్యేక బస్సులను నడిపారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, భీమవరం, తెనాలి, గుంటూరు, కాకినాడలకు  ప్రత్యేక బస్సులు నడిపారు. ఆంధ్రప్రదేశ్ కు హైద్రాబాద్ నగరంలోని పలు చోట్ల నుండి ప్రత్యేక బస్సులను నడిపారు. హైద్రాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, మీయాపూర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్, జీడిమెట్ల, ఉప్పల్ క్రాష్ రోడ్స్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుండి ఈ బస్సులను నడిపారు.

సంక్రాంతిని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ నెల 7 నుండి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.6970 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.ప్రత్యేక బస్సులు 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయనున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరుల నుండి కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.
 

click me!