
హైదరాబాద్: హైద్రాబాద్ ముషీరాబాద్‌లో దేవాలయాల కమిటీ సమావేశంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షఁణ చోటు చేసుకొంది. ఇరువర్గాలు పరస్పరం కుర్చీలు విసరుకొన్నాయి.దేవాలయాల కమిటీ సమావేశంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తమకు తెలియకుండానే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవకు దిగారు.
బోనాల పండుగ సందర్భంగా దేవాలయాలకు చెక్కుల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఈ విషయమై గొడవకు దిగారు. పరస్పరం కుర్చీలు విసురుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలు శాంతించాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.