ధర్మపురి బీజేపీలో వర్గ విభేదాలు.. మాజీ ఎంపీ వివేక్‌ ఎదుటే తిరుగుబాటు బావుటా

Siva Kodati |  
Published : Jan 07, 2023, 09:11 PM IST
ధర్మపురి బీజేపీలో వర్గ విభేదాలు.. మాజీ ఎంపీ వివేక్‌ ఎదుటే తిరుగుబాటు బావుటా

సారాంశం

ధర్మపురి నియోజకవర్గ బీజేపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మాజీ ఎంపీ వివేక్ ఎదుటే నాయకులు వాగ్వాదానికి దిగారు. పార్టీలో పెట్టుబడిదారులకే పీఠం వేస్తున్నారని మాజీ నియోజకర్గ ఇన్‌ఛార్జ్ కన్నం అంజన్న అసహనం వ్యక్తం చేశారు.

ధర్మపురి నియోజకవర్గ బీజేపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మాజీ ఎంపీ వివేక్ ఎదుటే నాయకులు వాగ్వాదానికి దిగారు. ధర్మపురి ఎస్ఆర్ఆర్ గార్డెన్స్‌లో శనివారం నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సభలో ప్రోటోకాల్ పాటించలేదని మాజీ నియోజకర్గ ఇన్‌ఛార్జ్ కన్నం అంజన్న అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పెట్టుబడిదారులకే పీఠం వేస్తున్నారని అంజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాల వర్చువల్ ప్రసంగాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఇక పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగిస్తుండగా కూడా సాంకేతిక లోపం తలెత్తింది. సంజయ్ ప్రసంగిస్తుండగానే కొన్ని చోట్ల నేతల ప్రసంగాలు స్ట్రీమింగ్ అయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ లేకపోవడంతో నేతలకు అర్ధంకాక ఇబ్బందులు పడ్డారు. దీంతో మధ్యలోనే రాష్ట్ర కార్యాలయం నుంచి స్ట్రీమింగ్ నిలిపివేశారు. 

ALso REad : బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాల్లో సాంకేతిక సమస్యలు.. అర్ధం కానీ నేతల ప్రసంగాలు, స్ట్రీమింగ్

అంతకుముందు బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అన్నారు. కేంద్రం నిధులపై తెలంగాణ సర్కార్ తప్పుడు లేఖలు చెబుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చకు సిద్దమని ప్రకటించారు. కేంద్రం నిధులపై ఆధారాలతో సహా చూపిస్తామని అన్నారు. కేసీఆర్ రాజీనామా పత్రం పట్టుకుని చర్చకు రావాలని అన్నారు. రాజకీయాల గురించి కాదని.. అభివృద్ది గురించి మాట్లాడాలని అన్నారు. 

రైతు బంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ  కింద జమ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారి ఇన్నేళ్లు గడిచినా ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం అని ఆరోపించారు.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్