హైదరాబాద్ : కూకట్‌పల్లిలో భవనం కూలిన ఘటనలో రెండుకు చేరిన మృతుల సంఖ్య

By Siva KodatiFirst Published Jan 7, 2023, 8:48 PM IST
Highlights

హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకి చేరింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. 

హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీశారు. కాగా.. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో వున్న భవనం నాలుగు, ఐదో అంతస్తు స్లాబ్ శనివారం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోగా.. భవన యజమాని సహా పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. నాణ్యతా లోపం కారణంగానే భవనం శ్లాబు కూలినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

click me!