ఈ నెల 14న యాదాద్రికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ: వెంట తమిళిసై, కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు

Siva Kodati |  
Published : Jun 12, 2021, 07:07 PM IST
ఈ నెల 14న యాదాద్రికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ: వెంట తమిళిసై, కేసీఆర్.. భారీ స్వాగత ఏర్పాట్లు

సారాంశం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెల 14న యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ కూడా సీజేఐతో పాటు యాదాద్రికి వెళ్లనున్నారు. సీజేఐ, గవర్నర్, సీఎం కలిసి యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:హైద్రాబాద్‌కు చేరుకొన్న సీజేఐ: ఘనస్వాగతం పలికిన తెలంగాణ సర్కార్

నిన్న తిరుపతి నుంచి హైదరాబాద్‌ చేరుకున్న సీజేఐకి శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో బస చేసిన జస్టిస్‌ రమణ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలు, సదస్సుల్లో పాల్గొంటారు.  

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్