నార్సింగిలో కరోనా కలకలం.. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్ధులకి పాజిటివ్

By Siva Kodati  |  First Published Dec 28, 2021, 8:53 PM IST

హైదరాబాద్ (hyderabad) శివారులోని నార్సింగిలో (narsingi) కరోనా (coronavirus) కలకలం రేపింది. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. కాలేజీలో 25 మందికి కరోనా సోకినట్లు తేలడంతో నార్సింగి మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో మొత్తం శానిటైజేషన్ చేశారు. 


తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలల్లో భారీగా  కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ (hyderabad) శివారులోని నార్సింగిలో (narsingi) కరోనా (coronavirus) కలకలం రేపింది. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ప్రైవేటు కాలేజీ ఉంది.. అయితే అందులో చదువుతున్న విద్యార్థులు గత కొన్నిరోజులుగా తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నారు. 

దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. మంగళవారం ఉదయం విద్యార్థులకు వైద్య పరీక్షలతో పాటు కరోనా టెస్టులు కూడా చేయించింది. ఈ పరీక్షల్లో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలడంతో నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. కాలేజీలో 25 మందికి కరోనా సోకినట్లు తేలడంతో నార్సింగి మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో మొత్తం శానిటైజేషన్ చేశారు. మిగిలిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. 

Latest Videos

undefined

ALso Read:తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్, 62కి చేరిన కేసులు

మరోవైపు తెలంగాణ‌లో ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా 7 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంగళవారం ప్రకటించింది.  దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. 

కాగా... కొత్త సంవ‌త్స‌రం వేడుల‌కు (new year celebrations) తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక అనుమ‌తులు ఇచ్చింది.  మ‌ద్యం దుకాణాలు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు, బార్లు, ప‌బ్‌లు, రెస్టారెంట్లు అర్థ‌రాత్రి ఒంటిగంట వ‌ర‌కు తెరిచి ఉంచేందుకు ఓకే చెప్పింది. అయితే రాష్ట్రంలో ఓవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్ర‌త్యేక అనుమ‌తులు ఇవ్వ‌డంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. స‌భ‌లు, ర్యాలీల‌కు అనుమ‌తులు నిరాక‌రించిన ప్ర‌భుత్వం కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లకు మ‌ద్యం దుకాణాల‌కు ఎలా అనుమ‌తిస్తుందని పలువురు ప్ర‌శ్నిస్తున్నారు.  

click me!