సివిల్స్ లో తెలుగు విద్యార్థుల హవా

By ramya NFirst Published Apr 6, 2019, 11:36 AM IST
Highlights

దేశంలో అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడేనికి చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించారు.

దేశంలో అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడేనికి చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఇదే అగ్ర ర్యాంకు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 మంది ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం. పరీక్షల తుది ఫలితాలను యూపీఎస్‌సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.

 మూడు దశల్లో జరిగే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో గత ఏడాది జూన్‌ 3న జరిగిన మొదటి దశ ప్రాథమిక పరీక్షలకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికిపై హాజరయ్యారు. అందులో 10,468 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. గత ఏడాది సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. వారి నుంచి 1994 మంది వ్యక్తిత్వ (మౌఖిక) పరీక్షకు ఎంపికయ్యారు.

 రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 39 వేల మంది ప్రాథమిక పరీక్షలు రాయగా, అందులో దాదాపు 500 మంది ప్రధాన పరీక్షలకు అర్హత పొందారు. వారిలో 75 మందికిపైగా మౌఖిక పరీక్షకు ఎంపికకాగా చివరకు 40 మంది విజేతలుగా నిలిచినట్లు అంచనా వేస్తున్నారు. తొలి వందర్యాంకుల్లో అయిదుగురు తెలుగువాళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. 

సత్తాచాటిన తెలుగు విద్యార్థులు వీరే..
కర్నాటి వరుణ్ రెడ్డి- 7వ ర్యాంకు- మిర్యాలగూడ
 షాహిద్- 57వ ర్యాంకు- అచ్చంపేట
సూర్యసాయి ప్రవీణ్ చంద్ -64వ ర్యాంకు- అమలాపురం
కేవీ మహేశ్వర్ రెడ్డి-126వ ర్యాంకు- కడప జిల్లా లక్కిరెడ్డి పల్లి
చిట్టిరెడ్డి శ్రీపాల్-131వ ర్యాంకు-వరంగల్ జిల్లా శాయంపేట
సిరి మేఘన-171వ ర్యాంకు-హైదరాబాద్
శివ నిహారిక-237వ ర్యాంకు
బాణోతు మృగేందర్‌లాల్‌ -551వ ర్యాంకు- ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం
 

click me!