ప్రేమజంటకు పెళ్లి చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

Published : Dec 25, 2017, 08:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ప్రేమజంటకు పెళ్లి చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

సారాంశం

ప్రేమజంటకు పెళ్లి చేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసిన పనిని అభినందిస్తున్న జనాలు

ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రేమ జంటకు పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం కూడా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరి ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే??? ఎవరా ప్రమే జంట? ఏమా కథ అనుకుంటున్నారా? చదవండి మరి.

అల్విన్ కాలనీలోని వివేకానంద నగర్ డివిజన్ లోని విజయ్ నగర్ కాలనీలోని దేవాలయంలో సోమవారం ఉదయం ప్రేమజంటకు పెళ్లి జరిగింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ పెళ్లి జరిపించారు. ప్రేమ జంట కు పెళ్లి చేయడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ప్రేమికులు జితేందర్, మరియమ్మలకు పెళ్లి పుస్తె మట్టెలు అందించి మరీ పెళ్లి జరిపించారు ఎమ్మెల్యే. అనంతరం ప్రేమ జంట కు దండలు అందించి అభినందించారు. ఆశీర్వదించారు.

కల్యాణ లక్ష్మీ కింద ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం వ్యవస్థాపకులు గంధం రాములు, తెలంగాణ మహిళ సంరక్షణ సమితి వ్యవస్థాపకులు శ్రావణి రెడ్డి, టిపియుఎస్ రాష్ట్ర కార్యదర్శి గ్యార శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర యాకయ్య, ఏరియా కమిటీ మెంబెర్ అంజలి, మహిళ నాయకులు రేణుక, గాదె లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే