పాతబస్తీలో ఉద్రిక్తత... ఆదిదేవుడు గణపతినే అరెస్ట్ చేసిన పోలీసులు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 12, 2021, 09:53 AM ISTUpdated : Sep 12, 2021, 10:10 AM IST
పాతబస్తీలో ఉద్రిక్తత... ఆదిదేవుడు గణపతినే అరెస్ట్ చేసిన పోలీసులు (వీడియో)

సారాంశం

తెెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వినాకయ చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు.

హైదరాబాద్: వినాయకచవితి సందర్భంగా ఏర్పాటుచేసిన బొజ్జగణపయ్య విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ వాహనంలో తరలించారు పోలీసులు. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వినాయక విగ్రహంతో పాటు నిర్వహకులను కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. 

వీడియో

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో కొందరు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తున్నారు. అయితే ఈ పూజాదిక కార్యాక్రమాల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందంటూ ఓ వర్గం ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వినాయకుడి విగ్రహాన్ని తొలగించి పోలీస్ వాహనంలో ఎక్కించారు. ఇలా హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే గణేశుడినే అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. 

read more  గుత్తిలో విషాదం: వినాయకమండపం వద్ద డ్యాన్స్ చేస్తూ మృతి

అంతేకాదు విగ్రహాన్ని ఏర్పాటుచేసిన వారిని, విగ్రహ తరలింపును అడ్డుకోడానికి ప్రయత్నించిన హిందూ సంఘాల వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు హిందూ సంఘాలు పోలీసులు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఓ వర్గంవారి కోసం మరో వర్గం మనోభావాలను దెబ్బతీయడం తగదని హెచ్చరిస్తున్నారు.  భారత్ లో ఉన్నామా..ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా...? అన్న అనుమానం కలుగుతోందని... ఒక్కడి ఫిర్యాదుతో మెజారిటీ మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ పోలీసులను నిలదీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu