
ABN MD Vemuri Radhakrishna : ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ( Vemuri Radhakrishna) పై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు చేస్తున్న సమయంలో వారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో వేమూరి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సీఐడీ పోలీసులు.
సీఐడీ విధులకు ఆటంకం కలిగించారని రాధాకృష్ణ( Vemuri Radhakrishna )తో పొటుగా మరికొందరు పై సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయ ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియోగ్రాఫర్ ఎన్.రమేశ్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
Read Also: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. మాట్లాడాల్సింది కేంద్రం దగ్గర : పవన్ దీక్షకు సుచరిత కౌంటర్
రాధాకృష్ణపై నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్‌ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని, ఆ తరువాత విచారణ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కేసు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలిపారు. ఈ నెల 10న ( శుక్రవారం) ఈ ఘటన జరగ్గా 11న సాయంత్రం ఏడు గంటలకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్‌లో వివరించారు.
కాగా, సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. లక్ష్మీనారాయణ నివాసానికి వేమూరి రాధాకృష్ణ వెళ్లినట్టు రాధాకృష్ణ తెలిపారు. లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పేందుకే అక్కడికి వెళ్లిననీ, విచారణ సమయంలో సీఐడీ అధికారులకు సహకరించాలని, వారితో వాదనకు దిగడంవల్ల ప్రయోజనం ఉండదని లక్ష్మీనారాయణకు, వారి కుటుంబ సభ్యులకు సూచించనని రాధాకృష్ణ అన్నారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు కూడా ఉండాలని తనని కోరారని తెలిపారు. సోదాలు పూర్తి అయిన తరువాత.. సీఐడీ అధికారులు తనకి ధన్యవాదాలు కూడా చెప్పారని. అయినప్పటికీ... సీఐడీ అధికారులను అడ్డుకున్న రాధాకృష్ణ అని అప్పుడే జగన్ చానల్ అవాస్తవాలను ప్రసారం చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు సీఐడీ అధికారులు తమపై కేసులు పెట్టారని వివరించారు రాధాకృష్ణ అండ్ టీం.
Read Also: కరోనా కలవరం... ఒమిక్రాన్ లో మూడు సబ్ వేరియంట్స్..!
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యూత్ కు లక్ష్మినారాయణ ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ట్రైనింగ్ సెంటర్లలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. హైదరాబాద్‌లో శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు సీఐడీ అధికారులు. ట్రైనింగ్ సెంటర్ లలో అక్రమాలు జరిగాయా? ఒకవేళ అక్రమాలకు పాల్పడితే.. ఏ విధంగా జరిగింది ? ఈ అవినీతిలో ఇంకెవరి హస్తమైనా ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేశారు. సోదాల అనంతరం.. ఈ కేసు లో ముగ్గురిని ఏసీబీ కోర్టు రెండువారాల పాటు రిమాండ్‌కు తరలించింది. నిందితులు సౌమ్యాద్రి, ముఖేశ్, వికాస్ ను కొవిడ్ పరీక్షల కోసం మచిలీపట్నం తీసుకెళ్లారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కా ర్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు ఆదివారం రెండోరోజు దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌తోపాటు పూణె, ముంబై, ఢిల్లీలోని షెల్ కంపెనీల రికార్డులను పరిశీలించి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ జే లక్ష్మీనారాయణలతోపాటు 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.