హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను చిన జీయర్ స్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చిన జీయర్ స్వామికి వివరాలు తెలిపారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడి గాయాలపాలయ్యారు. తుంటి ఎముక విరగడంతో ఆయనకు డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. శనివారం కేసీఆర్ డాక్టర్ల పర్యవేక్షణలో వాకర్ల సాయంతో నడిచారు. అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ఆయన వాకర్ సాయంతో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
LPG Cylinder: సిలిండర్ ధరపై వదంతులు.. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ముందు క్యూలు.. వాస్తవం ఏమిటీ?
కాగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను చిన జీయర్ స్వామి పరామర్శించారు. శనివారం సాయంత్రం సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు ఆయన చేరుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆయనను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ అందుతున్న వైద్యం వివరాలను కేసీఆర్ చిన జీయర్ స్వామికి వివరించారు.
Rythu Bandhu: రైతు బంధుపై పొలిటికల్ హీట్.. ఎప్పుడిస్తారని హరీశ్ రావు ప్రశ్న.. మంత్రి సీతక్క సమాధానం
ఇదిలా ఉండగా.. యశోదా హాస్పిటల్ వైద్యులు కేసీఆర్ కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. అందులో కేసీఆర్ కోలుకుంటున్నారని తెలిపారు. ‘‘ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన నొప్పి నుంచి ఉపశమనం పొందరాు. రోజంతా బాగా విశ్రాంతి తీసుకున్నారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రోగిని 12 గంటల్లో నడవాలని సూచించే ప్రామాణిక అంతర్జాతీయ ప్రాక్టీస్ మార్గదర్శకాల ప్రకారం కేసీఆర్ ను మంచం మీద నుండి లేపి, ఆపరేషన్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో నడిచేలా చేశాము. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చిన్న వ్యాయామాల షెడ్యూల్ ఇచ్చాం. కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయన పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నారు.’’ అని పేర్కొంది.
Jagga Reddy: నేను ఓడినా.. పిలవాల్సిందే.. అధికారులకు జగ్గారెడ్డి ఆర్డర్
గురువారం రాత్రి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్న బాత్ రూంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు గాయాలు కావడంతో హుటా హుటిన యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చారు. దీంతో పరీక్షలు జరిపిన డాక్టర్లు తుంటి ఎముక విరిగిందని నిర్ధారించి, సర్జరీ చేయాలని నిర్ణయించారు. కాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు.