చిన్నారి మెడను కోసిన చైనా మాంజా.. తండ్రితో బైక్ మీద వెడుతుంటే విషాదం..

Published : Jan 14, 2023, 02:05 PM IST
చిన్నారి మెడను కోసిన చైనా మాంజా.. తండ్రితో బైక్ మీద వెడుతుంటే విషాదం..

సారాంశం

చైనామాంజా కోసుకుపోయి ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యింది. తండ్రితో బైక్ మీద వెడుతుండగా ఆ చిన్నారికి గాయాలయ్యాయి. 

హైదరాబాద్ : సంక్రాంతి సంబరాలు హైదరాబాదులో ఒక కుటుంబంలో విషాదాన్ని నింపాయి.  తండ్రితో కలిసి సరదాగా బైక్ మీద వెళుతున్న ఓ చిన్నారి మెడకు చైనా మాంజా చుట్టుకుపోయింది. మాంజా కోసుకోవడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చైతన్యపురి ఎస్సై  ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వినయ్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వనస్థలిపురం సమీపంలోని కమలానగర్లో నివాసం ఉంటున్నాడు. అతని భార్య స్నేహలత. ఆమె కూడా ఉద్యోగే. వీరికి ఐదున్నర ఏళ్ల వయసున్న కీర్తి అనే కూతురు ఉంది.

శుక్రవారం సాయంత్రం ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద భార్యను పికప్ చేసుకునేందుకు వినయ్ కుమార్ వెళ్ళాడు. అతనితో పాటు కూతురు కూడా బైక్ మీద వచ్చింది. వీరు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రూట్లో భార్యను పికప్ చేసుకోవడానికి వెళ్లారు. అలా వెళుతున్న క్రమంలో నాగోల్ పైవంతన పైనుంచి ప్రయాణిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేస్తున్నారు.  అలా ఎగురుతున్న గాలిపటానికి ఉన్న చైనా మాంజా ఒకటి పక్కనున్న కరెంటు స్తంభానికి చిక్కుకుంది. అది బైక్ మీద ముందు కూర్చుని ఉన్న  కీర్తి మెడకు కోసుకుపోయి.. గాయం లోతుగా అయ్యింది. 

కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్.. హైద‌రాబాద్ లో షాకింగ్ ఘ‌ట‌న

ఆ మాంజా కోసుకుని వినయ్ ముక్కుకు కూడా గాయమైంది. కూతురి మెడ నుంచి తీవ్ర రక్తస్రావం రావడం గమనించిన వినయ్ ఆమెను వెంటనే దగ్గర్లోని సుప్రజ ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత ప్రధమ చికిత్స చేయించి.. అక్కడి నుంచి చింతలకుంట రెయిన్బో ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి శనివారం నాడు శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. తండ్రి వినయ్ ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu