కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్.. హైద‌రాబాద్ లో షాకింగ్ ఘ‌ట‌న

By Mahesh RajamoniFirst Published Jan 14, 2023, 12:36 PM IST
Highlights

Hyderabad: ఫుడ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన ఒక ఫుడ్ డెలివరీ బాయ్.. తన కస్టమర్ కుక్క మొరుగుతూ..తనపైకి దూసుకురావడంతో భయపడిపోయి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రాణాలు నిలుపుకోవడానికి ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 
 

Delivery boy jumps off third floor fearing dog: ఫుడ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన ఒక ఫుడ్ డెలివరీ బాయ్.. తన కస్టమర్ కుక్క తన వద్దకు దూసుకురావడంతో భయపడిపోయి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రాణాలు నిలుపుకోవడానికి ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఫుడ్ పార్శిల్ డెలివ‌రీ చేయడానికి వెళ్లిన ఫుడ్ డెలివ‌రీ బాయ్ మీద‌కు ఒక్క‌సారిగా క‌స్ట‌మ‌ర్ కుక్క దూసుకురావ‌డంతో భ‌యాందోళ‌న‌కు గురై అత‌ను మూడో అంత‌స్తు నుంచి దూకేశాడు. ఈ క్ర‌మంలోనే ఫుడ్ డెలివ‌రీ బాయ్ కి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న అత‌ని త‌ల‌కు బ‌ల‌మైన గాయాలు అయ్యాయి. ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడ‌ని వైద్యులు తెలిపారు. అయితే, ఈ మొత్తం విష‌యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు క‌స్ట‌మ‌ర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

డెలివరీ బాయ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, అయితే ఐసీయూలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. రోడ్ నెం.6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ భ‌వ‌నంలో నివసిస్తున్న శోభనా నాగాని అనే క‌స్ట‌మ‌ర్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డ‌ర్ తీసుకున్న త‌ర్వాత‌.. స్విగ్గీ డెలివరీ బాయ్ మహ్మద్ రిజ్వాన్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి డోర్ కొట్టాడు. అయితే, 11 ఏళ్ల జర్మన్ షెపర్డ్ కుక్క తలుపు తెరవగానే మొరగడంతో పాటు డెలివ‌రీ బాయ్ మీద‌కు దూసుకొచ్చింది. దీంతో భ‌య‌ప‌డిపోయిన అత‌ను మూడో అంత‌స్తు నుంచి దూకేశాడు. తాను కుక్క కు భయపడి తిరిగి పరుగెత్తుతుండగా కుక్క తనను వెంబడించిందని బాధితుడు పోలీసుల‌కు చెప్పాడు. ఈ క్ర‌మంలోనే ఆలోచించకుండా భయంతో భవనంపై నుంచి దూకినట్లు పోలీసులకు తెలిపాడు.

శోభన కిందకు పరుగెత్తి రక్తపు గాయాలతో పడి ఉన్న అతడిని చూసి నిమ్స్ కు తరలించారు. తలకు గాయాలైన రిజ్వాన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా అత‌ను ఐసీయూలోనే ఉన్నాడ‌ని స‌మాచారం. కాగా, రిజ్వాన్ మూడేళ్లుగా డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు శోభనపై ఐపీసీ సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు), 289 (జంతువు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు.

click me!