చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో డీఏవీ స్కూల్‌లో బాధితురాలి కుటుంబం పూజలు

By Mahesh KFirst Published Oct 22, 2022, 6:20 PM IST
Highlights

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడు సీఎస్ రంగరాజన్ డీఏవీ స్కూల్‌లో అఘాయిత్యానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను ఆలయానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషాద కాలం నుంచి బయటపడే ధైర్యాన్ని ఇవ్వడానికి జటాయువు కంకణాలను వారి మణికట్టుకు కట్టారు.
 

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని డీఏవీ స్కూల్‌లో చిన్నారిపై అఘాయిత్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన దోషికి కఠిన శిక్ష విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఆ బాలిక తల్లిదండ్రులను చిలుకూరి బాలాజీ టెంపుల్ పురోహితుడు సీఎస్ రంగరాజన్ ఆలయానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అఘాయిత్యాలకు పాల్పడేవారిని ‘రేపాసురులు’గా గుర్తించాలని, వారిని నరికేయాలని లేదా ఉరి తీయాలని అన్నారు. చాలా సున్నిత మనస్కులు కూడా తన వంటి అభిప్రాయాలే కలిగి ఉన్నారని తెలిపారు. 

బాలిక తల్లిదండ్రులతోపాటు ఆయన మహా ప్రదక్షిణం చేశారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని అర్చకుడు ఓదార్చారు. ఓ దోషిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని భరోసా ఇచ్చారు. ఈ విషాద కాలాన్ని తట్టుకుని బయటపడటానికి వారికి జటాయు తాడును వారి మణికట్టుకు కట్టారు. 

ఈ కుటుంబాన్ని ఓదర్చడానికి తన వద్ద మాటలు లేవని అర్చకుడు రంగరాజన్ అన్నారు. రామాయణంలోని జటాయువు పాత్రను సమాజంలో ప్రతి ఒక్కరూ పోసించాలని, అలాంటి సమాజం కావాలని పేర్కొన్నారు. సీతా మాత ను కాపాడటానికి జటాయువు రావణుడిపై తీవ్ర పోరు చేశాడని వివరించారు. సమాజంలో మహిళలకు భద్రత కకోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, కానీ, వాటికవిగా ఈ ఉన్మాదుల నుంచి మహిళలను రక్షించ లేవని అన్నారు. మన యువత రక్షకులుగా తయారవ్వడానికి తరుచూ వారికి హితబోధం చేస్తూ ఉండాలని ఆయన తెలిపారు.

Also Read: రేవంత్ రెడ్డిని కలిసిన డీఏవీ స్కూల్ అత్యాచార బాధిత చిన్నారి తల్లిదండ్రులు..న్యాయం జరిగేలా చూడాలని వేడుకోలు...

అమ్మాయిల పాదాలకు పవిత్రమైన పసుపు పుసి చేసే కన్య వందనం అనే కార్యక్రమాన్ని చిలుకూరి బాలాజీ ఆలయం నిర్వహిస్తున్నదని, ఇది అబ్బాయిల్లో సోదరి భావాన్ని పెంచుతుందని వివరించారు.

పాఠశాలల్లో ఇలాంటి దుండగుల నుంచి రక్షణ కోసం చిన్నారుల రక్షణ కోసం సేఫ్టీ గైడ్‌లైన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన వివరించారు.

click me!