హైదరాబాద్: పబ్‌లో ప్రత్యక్షమైన చిన్నారి.. సీపీ, డీజీపీ, మీడియాకు వీడియో పంపిన నెటిజన్

Siva Kodati |  
Published : Sep 01, 2021, 04:32 PM IST
హైదరాబాద్: పబ్‌లో ప్రత్యక్షమైన చిన్నారి.. సీపీ, డీజీపీ, మీడియాకు వీడియో పంపిన నెటిజన్

సారాంశం

18 ఏళ్లు నిండని వారికి వైన్ షాపులో మద్యమే అమ్మరు. అలాంటిది హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ బాలిక ప్రత్యక్షమైంది. ఈ వీడియోను రికార్డ్ చేసిన ఓ యువకుడు సైబరాబాద్ సీపీ, డీజీపీ, మీడియా ఛానెళ్లకు ట్యాగ్ చేశాడు. పబ్‌లో ఈ చిన్నారికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు.

18 ఏళ్లు నిండని వారికి వైన్ షాపులో మద్యమే అమ్మరు. అలాంటిది హైదరాబాద్‌లోని ఓ పబ్ ఏకంగా ఓ చిన్నారిని అనుమతించింది. పీకలదాకా తాగి విచ్చలవిడిగా చిందులు వేసే పబ్‌లో ఓ బాలికను అనుమతించడం నగరంలో దుమారం రేపుతోంది. గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ బాలిక ప్రత్యక్షమైంది. ఈ వీడియోను రికార్డ్ చేసిన ఓ యువకుడు సైబరాబాద్ సీపీ, డీజీపీ, మీడియా ఛానెళ్లకు ట్యాగ్ చేశాడు. పబ్‌లో ఈ చిన్నారికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో పబ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చిన్నారిని పబ్‌కు తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎవరా అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే
Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే