థర్డ్ వేవ్ మీద శాస్త్రీయ ఆధారాలు లేవు.. డీహెచ్ శ్రీనివాసరావు

Published : Sep 01, 2021, 03:40 PM IST
థర్డ్ వేవ్ మీద శాస్త్రీయ ఆధారాలు లేవు.. డీహెచ్ శ్రీనివాసరావు

సారాంశం

1-10 ఏళ్లలోపు పిల్లల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకిందన్నారు. కోవిడ్ బారిన పడినవారిలో 73శాతం మంది 20-60 ఏళ్లలోపు వారు ఉన్నారని చెప్పారు. 

హైదరాబాద్ : తెలంగాణలో 18 నెలల తరువాత స్కూళ్లు ప్రారంభం అయ్యాయని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. స్కూళ్లలో ఈ రోజు విద్యార్థుల హాజరుశాతం స్వల్పమేనన్నారు. కోవిడ్ కట్టడికి మొదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరణాల శాతం కేవలం 0.5 శాతం, రికవరీ రేటు 98.5శాతం ఉందన్నారు. 

1-10 ఏళ్లలోపు పిల్లల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు వారు కేవలం 13 శాతం మందికి మాత్రమే కోవిడ్ సోకిందన్నారు. కోవిడ్ బారిన పడినవారిలో 73శాతం మంది 20-60 ఏళ్లలోపు వారు ఉన్నారని చెప్పారు. 

తెలంగాణలో బతుకమ్మ వంటి వేడుకలు జరిగినా కేసులు పెరగలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భయపడాల్సిన పని లేదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందన్నారు. థార్డ్ వేవ్ గురించి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు