మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము..

By team teluguFirst Published Nov 7, 2021, 12:35 PM IST
Highlights

తెలంగాణలోని మహబూబాబాద్ (mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది (snake bite).

తెలంగాణలోని మహబూబాబాద్ (mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది (snake bite). మహబూబాబాద్‌ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు. తల్లిదండ్రులతో పాటు చిన్నారిని పాము కాటేసింది. ఈ ఘటనలో 3 నెలల చిన్నారి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. శనిగపురానికి చెందిన మమత, క్రాంతి దంపతులకు 3 నెలల పాప ఉంది. ఆదివారం ఉదయం నిద్రలేచేసరికి పాప నోటి వెంట నురగ రావడం చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్టుగా వైద్యులు నిర్దారించారు.

మరోవైపు పాపకు కప్పి ఉంచి దుప్పటి నుంచి పాము బయటపడింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే మమత, క్రాంతి కూడా స్పృహ కోల్పోయారు. దీంతో వారిని కూడా పాము కాటేసిందని నిర్దారణకు వచ్చిన వైద్యులు.. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడు నెలల చిన్నారి పాము కాటుతో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఈ విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also read: భూపాలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం... ఎస్సై సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే..
వారం రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని, ఆమె తల్లిని పాము కాటేసింది. చింతపల్లి మండలం ససర్లపల్లి గ్రామానికి చెందిన మహిన్, సాల్మా దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే ప్రతి రోజులాగే అక్టోబర్ 29వ తేదీ రాత్రి కూడా.. సాల్మా, తన చిన్న కూతురు మాలిక్ కౌసర్‌తో నేలపై నిద్రపోయింది. అయితే ఆ సమయంలో వారిద్దరిని పాటు కాటు వేసింది. 

సాల్మాకు మెలుకువ వచ్చేసరికి ఆమెకు పాము చుట్టుకుని ఉంది. దీంతో కంగారు పడిపోయిన సాల్మా పామును పక్కకు విసిరేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే దేవరకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పాప మాలిక్ కౌసర్‌ను కూడా పాము కాటు వేసినట్లు తెలుసుకున్న కుటుంబ సబ్యులు చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ పాప మరణించింది. సాల్మా ప్రాణాలతో బతికి బయటపడింది.
 

click me!