చికోటి ప్రవీణ్ వాట్సాప్ ఛాటింగ్‌లో కీలక విషయాలు.. ఆ నలుగురు రాజకీయ నేతలెవరు..?

By Siva KodatiFirst Published Aug 5, 2022, 9:26 PM IST
Highlights

నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ నలుగురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చింది. సోమవారం నుంచి వారంతా ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం వుంది. ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్‌లో రాజకీయ ప్రముఖుల బండారం బయటపడినట్లుగా తెలుస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ నలుగురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చింది. సోమవారం నుంచి వారంతా ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం వుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులను చికోటి విదేశాలకు తీసుకెళ్లినట్లుగా ఈడీ గుర్తించింది. మరోవైపు క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీలపై ఇంకా ఈడీ ఆరా తీస్తోంది. ప్రవీణ్ వాట్సాప్ చాటింగ్‌లో రాజకీయ ప్రముఖుల బండారం బయటపడినట్లుగా తెలుస్తోంది. 

ఇకపోతే.. చీకోటీ ప్రవీణ్‌ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుపై ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్లలో తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించాడు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి పోస్టుల వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. 

ALso REad:సీఎం జగన్‌తో పరిచయం లేదు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు చీకోటీ ప్రవీణ్ ఫిర్యాదు

ఏపీ సీఎంతో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని.. అసలు ఆయనతో తనకు పరిచయమే లేదని చీకోటి ప్రవీణ్ చెప్పారు. దీని వెనుక ఏపీ ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లుగా అనుమానంగా ఉందని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వ్యక్తులను పట్టుకోవాలని ఫిర్యాదులో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు. ఇదే విషయంపై ఏపీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా చెప్పారు. 

మరోవైపు ఈడీ విచారణకు సంబంధించి వాస్తవాలు రాయాలని ప్రవీణ్ మీడియాను కోరారు. అతిగా ఊహించుకొని మీడియాలో కథనాలు ప్రసారం చేయడం వల్ల మీకు వచ్చే లాభం కూడా లేదని ఆయన మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు.  పలు మీడియా సంస్థలు పలు రకాలైన కథనాలు ప్రసారం చేస్తున్నాయన్నారు. అసలు వాస్తవాలు ఏమిటో మీరే తేల్చుకోవాలని చికోటి కోరారు. ఏది వాస్తవమో కూడా తేల్చుకోలేకపోతున్నారు.. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆయన మీడియాను కోరారు.వాస్తవాలు ప్రసారం చేస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు. అతిగా ఊహించుకొని తనను డీఫేమ్ చేయడం ద్వారా ఏముస్తుందని ప్రవీణ్ మీడియాను ప్రశ్నించారు. కేసినో కు సంబంధించి తాను త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని కూడా ఆయన వివరించారు.

click me!