ఈసారి కూడా చేపమందు పంపిణీకి బ్రేక్... బత్తిని హరినాధ్ గౌడ్ ప్రకటన

By Arun Kumar PFirst Published May 30, 2021, 10:07 AM IST
Highlights

లాక్ డౌన్, కరోనా ప్రమాదకర రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా చేపమందు పంపిణీని నిలిపివేసినట్లు నిర్వహకులు బత్తిని హరినాధ్ గౌడ్ ప్రకటించారు. 

హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే కరోనా వ్యాప్తి కారణంగా ఈసారి కూడా చేపమందు ప్రసాదం పంపిణీ కి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా ప్రమాదకర రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఏడాది మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నామని బత్తిని హరినాధ్ గౌడ్ వెల్లడించారు. జూన్ 8న చేపమందు ప్రసాదాన్ని కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని హరినాధ్ గౌడ్ తెలిపారు. 

హైదరాబాద్ లో నివాసముండే బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాల నుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాదు విదేశాల నుండి ఈ ప్రసాదాన్ని తీసుకోడానికి ఉబ్బసం రోగులు వస్తుంటారు. ఇలా ప్రతిసారీ దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ మందును తీసుకోడానికి వచ్చేవారు. 

ఈ చేపమందు పంపిణీ ప్రభుత్వ సహకారంతో జరిగేది. ప్రభుత్వమే ఈ మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు చేపలను కూడా సరఫరా చేసేది. అలాగే భారీగా తరలివచ్చే ప్రజల కోసం ప్రభుత్వాధికారులను ఉపయోగించేది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మందు పంపిణీని నిలిపివేసిన నిర్వహకులు ఈ ఏడాది కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నారు.  

వివిధ శాఖలు సమన్వయంతో పని చేయడానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అదనంగా మంచినీరు, వైద్యసదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్, బ్యారికేడింగ్, సిసిటీవిల ఏర్పాట్లు చేయాలన్నారు. 

 

click me!