జ్వరం అని వస్తే.. దెయ్యం పట్టిందంటూ చిత్రహింసలు పెట్టిన భూతవైద్యుడు.. బాలిక మీదికి ఎక్కి, తొక్కి..

Published : May 19, 2022, 11:32 AM IST
జ్వరం అని వస్తే.. దెయ్యం పట్టిందంటూ చిత్రహింసలు పెట్టిన భూతవైద్యుడు.. బాలిక మీదికి ఎక్కి, తొక్కి..

సారాంశం

జ్వరం వస్తే.. భూతవైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. అంతే అతను అదే ఛాన్స్ అని ఆమెకు దెయ్యం పట్టిందంటూ చిత్రహింసలు పెట్టాడు. మండే నిప్పుల మీద నడిపించాడు. దీంతో కాళ్లు తీయాల్సిన పరిస్థితికి ఆమె ప్రమాదంలో పడింది. 

వికారాబాద్ : ఇంటర్ చదువుతున్న బాలిక అనారోగ్యానికి గురయ్యింది అయితే ఆమెకు దెయ్యం పట్టిందని ఓ బాబా భయపెట్టాడు Exorcism చేస్తాం అంటూ ఆమెను నిప్పులపై నడిపించాడు.  Torture పెట్టాడు. పాదాలు కాలిపోయి తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భూతవైద్యం చేస్తానని..
వికారాబాద్ జిల్లా ధారూరు మండలం  కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య కుమార్తె అశ్విని (17) వికారాబాద్లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురయ్యింది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు..  తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూతవైద్యుడు) ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూతవైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు  తెలిపింది. ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మబలికాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు.  

మండే  నిప్పులపై బాలికను నడిపించడంతో పాటు.. ఆమెపై కాళ్ళు పెట్టి నిలుచున్నాడు అని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన బాలికను వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగాలేదని…  పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన పరిగి డీఎప్సీ శ్రీనివాస్ బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో నిరుడు అక్టోబర్ లో జరిగింది. భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి.. అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో గొడ్డలితో నరికి చంపాడు. ప్రకాశం జిల్లా jarugumalli మండలం కామేపల్లి గ్రామంలో అక్టోబర్ 17న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే... కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి విజయ (42) వ్యవసాయ కూలీ మేస్త్రీగా జీవనం సాగిస్తుంది. పొలంలో సోమవారం ఉదయం పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారు. వారిని పిలిచేందుకు రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయం లో వుడ్డెపాలెం వెళ్ళింది.  పనుల కోసం కూలీలను పిలుస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య (51) అనే భూతవైద్యుడు విషయాన్ని గమనించాడు.

విజయలక్ష్మిని శారీరకంగా అనుభవించాలని దుర్బుద్ధితో భూతవైద్యుడు గోపయ్య ఆమెతో మాటలు కలిపాడు.  ఆ సందర్భంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు.  నొప్పి తగ్గించేందుకు మందులు ఇస్తానంటూ నమ్మించాడు.  ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత Rape చేసేందుకు ప్రయత్నించాడు. ఊహించని పరిణామంతో విజయలక్ష్మి అతన్ని తీవ్రంగా Resistance చేసింది.ఈ విషయం బయటకు తెలిస్తే తనకు ఇబ్బంది వస్తుందని  ఓబయ్య భావించాడు. ఆమెపై దాడి చేసి కాళ్లు, చేతులు కట్టేసాడు.  అనంతరం గొడ్డలితో నరికి murder చేశాడు.  

ఈ హత్యోదంతాన్ని తన కుటుంబీకులకు తెలియడంతో వారు  జరుగు మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఎస్సై రజియా సుల్తానా బేగం  హుటాహుటిన తన సిబ్బందితో  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఉన్న నిందితుడు ఓబయ్యను తన వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, విజయలక్ష్మిని  మీ దారుణంగా హతమార్చిన విషయం తెలుసుకున్న కామేపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.  పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను బయటకు లాగి కర్రలతో మూకుమ్మడిగా attack చేశారు.  అడ్డుకోబోయిన ఎస్ఐ రజియా సుల్తానా పైన దాడి చేశారు.  విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓబయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే