పోతిరెడ్డిపాడుపై చెన్నై ఎన్జీటీలో ముగిసిన వాదనలు: సెప్టెంబర్ 3కి వాయిదా

By Siva KodatiFirst Published Aug 28, 2020, 8:12 PM IST
Highlights

పోతిరెడ్డిపాటు ప్రాజెక్ట్‌పై చెన్నై ఎన్జీటీలో శుక్రవారం వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఎన్జీటీ సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 

పోతిరెడ్డిపాటు ప్రాజెక్ట్‌పై చెన్నై ఎన్జీటీలో శుక్రవారం వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఎన్జీటీ సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

నిపుణుల కమిటీ ప్రాజెక్ట్‌లో అన్ని అంశాలు పరిశీలించడకుండానే పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నివేదిక ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది.

ఇప్పుడున్న దానికంటే  అధికంగా నీటిని తరలించే అవకాశం వుందని టీఎస్ సర్కార్ అభిప్రాయపడింది. పది లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆరోపించింది.

పోతిరెడ్డిపాడుతో ఏపీ ప్రభుత్వం భారీ విస్తరణతో ముందుకెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఇదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి, ఎన్జీటీకి సంబంధం లేదని ఏపీ సర్కార్ వాదించింది. 

కాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు)   ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది.ఈ కేసును రీ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధరఖాస్తును చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం అనుమతించింది.

ఇదే విషయమై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్జీటీ తీర్పును రిజర్వ్ చేసింది.  తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ ను దాఖలు చేయడంతో తీర్పు వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహాబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 28వ తేదీన తుది వాదనలు వింటామని ఎన్జీటీ ధర్మాసనం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!