నెక్లెస్‌రోడ్ పేరు మార్చిన కేసీఆర్.. ఇకపై పీవీ జ్ఞాన్ మార్గ్‌గా

By Siva KodatiFirst Published Aug 28, 2020, 6:28 PM IST
Highlights

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞాన్‌మార్గ్‌గా పేరు పెడుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞాన్‌మార్గ్‌గా పేరు పెడుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అలాగే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ నిర్మాణం చేపడతామని.. పీవీ నరసింహారావు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అన్నారు. ఆయన సంస్కరణలు చేసిన గొప్ప సంస్కర్త అని.. ప్రపంచం గుర్తించిన తెలంగాణ బిడ్డ అని కేసీఆర్ ప్రశంసించారు.

ఢిల్లీ, తెలంగాణ భవన్‌లలో పీవీ విగ్రహం పెట్టాలని సీఎం డిమాండ్ చేశారు. పీవీ ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలకు లేఖ రాస్తానని, అమెరికా మాజీ అధ్యక్షులను ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదిస్తానన్నారు. అలాగే  పీవీ నరసింహారావు జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగరను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని.. పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని కోరతానని ముఖ్యమంత్రి తెలిపారు.

click me!