సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు... మా పిల్లలెంతో, విద్యార్ధులూ అంతే: సబిత

By Siva KodatiFirst Published Aug 28, 2020, 7:01 PM IST
Highlights

సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు చెబుతామన్నారు.

సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు చెబుతామన్నారు. మన పిల్లల బాధ్యత ఎంతో పాఠశాలల విద్యార్ధుల బాధ్యత అంతేనని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలనడం సరికాదని... కోర్ట్ ఆదేశాల ప్రకారం డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మొదటి సారి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నామని సబితా చెప్పారు.

విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఉదయం 8 నుంచి 10.30 వరకు ఇంటర్ క్లాసులు నిర్వహిస్తున్నామని, ఉదయం 10.30 తర్వాత కూడా పాఠశాలలకు క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు.

విద్యార్ధులకు వర్క్ షీట్లు ఇచ్చి హోంవర్క్ కేటాయిస్తామని.. స్కూళ్లు ప్రారంభించిన తర్వాత విద్యా వాలంటీర్లను తీసుకుంటామని సబిత చెప్పారు. ఇంటర్ కాలేజీల అఫిలియేషన్‌కి సంబంధించి.. త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వర్సిటీలకు త్వరలో వీసీలను నియమిస్తామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 

click me!