పటాన్ చెరులో కోడి పందాలు.. పోలీసుల ఆకస్మిక దాడి, పరారీలో టీడీపీ నేత చింతమేనేని

Siva Kodati |  
Published : Jul 06, 2022, 09:10 PM ISTUpdated : Jul 06, 2022, 09:13 PM IST
పటాన్ చెరులో కోడి పందాలు.. పోలీసుల ఆకస్మిక దాడి, పరారీలో టీడీపీ నేత చింతమేనేని

సారాంశం

హైదరాబాద్ పటాన్‌చెరులో కోళ్ల పందాలు జరుగుతున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరార్ అయినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది

హైదరాబాద్ పటాన్‌చెరులో కోళ్ల పందాలు జరుగుతున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరార్ అయినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. కోళ్ల పందాల స్థావరంలో రూ.10 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 100 కోళ్లను పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు కోళ్లపందాల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో వున్న చింతమనేని కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!