మాదాపూర్ లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

First Published May 30, 2018, 12:28 PM IST
Highlights

ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని రూ. లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్‌లో పోర్డ్‌ల్యాబ్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ పేరిట సతీష్‌ అనే వ్యక్తి గత డిసెంబర్‌లో ఐటీ కంపెనీ ప్రారంభించాడు. నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒకోక్కరి వద్ద నుంచి సుమారు రూ.1 లక్ష నుంచి రూ. రెండు లక్ష ల వరకు వసూలు చేశారు.
 
సుమారు 150 మందికి కంపెనీలో మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి, వారికి నామమాత్రం జీతాలు చెల్లించాడు. మూడు నెలల తర్వాత జీతాలు ఇవ్వకపోవగా, అడిగితే అసభ్యంగా ప్రవర్తిస్తు, వేరే కంపెనీల్లో కూడా ఉద్యోగాలు రాకుండా చేస్తామని బెదిరించాడు. దీంతో బాధితులు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులు మంగళవారం ఠాణా ముందు బైఠాయించారు. అయితే, పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

click me!