లోకేష్ మీద ప్రమాణం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా: బాబుకు మోత్కుపల్లి సవాల్

Published : May 30, 2018, 11:12 AM IST
లోకేష్ మీద ప్రమాణం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా: బాబుకు మోత్కుపల్లి సవాల్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఓ సవాల్ కూడా చేశారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఓ సవాల్ కూడా చేశారు. తాను చంద్రబాబును గవర్నర్ పదవి అడగలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 

తాను గవర్నర్ పదవి అడిగినట్లు చంద్రబాబు తను కుమారుడు లోకేశ్‌పై ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు.  ఏపీలో చంద్రబాబు ఓడిపోయేలా చూడాలని త్వరలో తాను మెట్లు ఎక్కి వేంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు.

తానెవరికీ అన్యాయం చేయలేదని, కానీ.. తనకు చంద్రబాబు అన్యాయం చేశారని మోత్కుపల్లి చెప్పారు. కోట్లు సంపాదిస్తున్న చంద్రబాబు సింగపూర్‌, దుబాయ్‌లలో దాచుకుంటున్నారని ఆరోపించా రు. 

చంద్రబాబు అక్రమ సంపాదనపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఉన్నంతకాలం మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరని అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu