హైద్రాబాద్‌‌కు చేరిన చరితారెడ్డి మృతదేహం

By narsimha lodeFirst Published Jan 5, 2020, 3:58 PM IST
Highlights

తెలుగు టెక్కీ చరితారెడ్డి  మృతదేహం ఆదివారం నాడు హైద్రాబాద్ కు చేరుకొంది.


హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి మృతదేహం ఆదివారం నాడు ఉదయం  ఇంటికి చేరింది. హైద్రాబాద్‌ రేణుకానగర్‌లోని రేణుకారెడ్డి ఇంటికి ఆమె మృతదేహం వచ్చింది.

అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన తెలుగు టెక్కీ చరితారెడ్డి మృతి చెందారు. మిచిగాన్‌లో చరితారెడ్డి ప్రయాణీస్తున్న కారును మద్యం మత్తులో వెనుక నుండి ఢీకొట్టడంతో  చరితారెడ్డి మృతి చెందింది.

Also read:అమెరికాలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి: అవయవదానం పూర్తి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చరితారెడ్డికి చెందిన  అవయవాలను దానం చేశారు. ఆమె బతికున్న సమయంలోనే తన అవయవాలను దానం చేసేందుకు ఆమె గతంలోనే అంగీకారపత్రం ఇచ్చింది. దీంతో చరితారెడ్డి నుండి సేకరించిన అవయవాలను 9 మందికి అమర్చారు. ఈ ఆరుగురిలో 9 మందిని తాము చూసుకొంటామని చరితారెడ్డి తల్లిదండ్రులు చెప్పారు.

Also read:అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం

అమెరికా నుండి విమానంలో దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇవాళ ఉదయం మృతదేహం చేరుకొంది. చరితారెడ్డి నివాసానికి మృతదేహన్ని తరలించారు. స్థానిక స్మశానవాటికలో  నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.  

click me!