ఎమ్మెల్సీగా  చినబాబు !

Published : Feb 26, 2017, 12:43 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఎమ్మెల్సీగా  చినబాబు !

సారాంశం

ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

నారా లోకేష్ ను ఏపీ కెబినెట్ లోకి  తీసుకోవాలన్న ‘తమ్ముళ్ల’ కోరిక త్వరలోనే నెరవేరబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ రోజు జరిగిన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

 

ఎమ్మెల్యే కోటాలో లోకేష్‑ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని పాలిట్ బ్యూరో నిర్ణయించినట్లు సమాచారం.

 

లోకేష్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలా... లేదా ముందుగానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై స్వయంగా చంద్రబాబు స్పష్టత ఇచే అవకాశం ఉందని పొలిట్ బ్యూరో సభ్యుడొకరు చెప్పారు.

 

ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

 

కాగా, పొలిట్ బ్యూరో సమవేశంలో తెలంగాణ, ఏపీ అసెంబ్లీ లో అనుసరించాల్సిన వైఖరిపైన, పార్లమెంట్ సమావేశాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల తీరుపై  చర్చ జరిగింది. 

 

అమెరికాలో తెలుగు వారిపై కాల్పుల ఘటనను పాలిట్ బ్యూరో ఖండించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అన్న క్యాంటిన్ ల ఏర్పాటునకు నిర్ణయించింది.

 

కాగా, చాలా కాలం తర్వాత నందమూరి హరికృష్ణ పొలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?