తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ: భవిష్యత్తు వ్యూహంపై కార్యాచరణ

By narsimha lode  |  First Published Jun 6, 2023, 5:09 PM IST

తెలంగాణ టీడీపీ నేతలతో  చంద్రబాబునాయుడు ఇవాళ సమావేశమయ్యారు.  పార్టీని బలోపేతం  చేసే విషయమై  నేతలకు  దిశా నిర్ధేశం  చేస్తున్నారు. 


హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలతో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  మంగళశారంనాడు హైద్రాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో  భేటీ అయ్యారు.  తెలంగాణ  రాష్ట్రంలో  రానున్న  రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలకు  చంద్రబాబు దిశా నిర్ధేశం  చేయనున్నారు

ఈ నెల  3వ తేదీన  చంద్రబాబునాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  బీజేపీ జాతీయ  అధ్యక్షుడు  జేపీ నడ్డాతో  భేటీ అయ్యారు.  బీజేపీతో  రానున్న ఎన్నికల్లో  పొత్తులపై  చంద్రబాబు చర్చిచారని ప్రచారం  సాగుతుంది.  అయితే  ఈ ప్రచారాన్ని  బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో  భేటీ ముగిసిన  తర్వాత  తెలంగాణ టీడీపీ నేతలతో  చంద్రబాబు  ఇవాళ  సమావేశం  కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 

Latest Videos

undefined

వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో  టీడీపీ, బీజేపీ మధ్య  పొత్తు ఉంటుందని ప్రచారం సాగుతుంది.  ఈ ప్రచారాన్ని  బీజేపీ  తెలంగాణ  బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్   తోసిపుచ్చారు.  ఇదంతా  ఊహజనితమేనని  ఆయన  ప్రకటించారు.

ఈ ఏడాది డిసెంబర్ లో  తెలంగాణ  రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  చంద్రబాబు  పార్టీ  నేతలకు దిశా నిర్దేశం  చేయనున్నారు.2014  తర్వాత  తెలంగాణలో  టడీపీ  క్రమంగా   బలాన్ని  కోల్పోతూ వచ్చింది.  టీడీపీ నుండి నేతలు. ఆ తర్వాత  ద్వితీయ శ్రేణి నేతలు  టీడీపీని వీడారు. టీడీపీ  ఓటు బ్యాంక్  కూడ  ఇతర  పార్టీలు  పంచుకుంటున్నాయి.  

తెలంగాణలో  పార్టీని తిరిగి బలోపేతం  చేసేందుకు  చంద్రబాబు  ప్రయత్నాలు  ప్రారంభించారు. వీలున్న సమయంలో  తెలంగాణ టీడీపీ నేతలతో  చంద్రబాబు   సమావేశాలు నిర్వహిస్తున్నారు.

also read:అమిత్ షాతో భేటీ: తెలంగాణ నేతలతో రేపు చంద్రబాబు భేటీ, ఏం జరుగుతుంది?

తెలంగాణలో  ఆరు మాసాల్లో  ఎన్నికలు  రానున్నాయి.  ఈ సమయంలో  తెలంగాణ  నేతలతో  చంద్రబాబు  సమావేశమై   పార్టీ  నేతలతో  చర్చిస్తున్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ,  టీజేఎస్  కూటమిగా  పోటీ  చేశాయి.  గత ఎన్నికల  సమయంలో  టీడీపీ  రెండు స్థానాలను దక్కించుకుంది.  కానీ  ఆ ఇద్దరు  టీడీపీ ఎమ్మెల్యేలు   బీఆర్ఎస్ లో  చేరారు. .

click me!