ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరం: పార్టీ నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబు

By narsimha lode  |  First Published Jun 2, 2022, 5:09 PM IST

ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. బద్వేల్ ఉప ఎన్నికకుదూరంగా ఉన్నట్టుగానే ఆత్మకూరు ఉప ఎన్నికకు కూడ దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో చంద్రబాబు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 


అమరావతి: Atmakur bypoll ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా TDP చీఫ్ Chandrababu ప్రకటించారు. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతం రెడ్డి Hyderabadలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. Mekapati Gautham Reddy కుటుం బసభ్యులు కూడా విక్రంరెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి  నిలపాలనే విషయమై ఏకాభిప్రాయానికి వచ్చారు. మేకపాటి గౌతం రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేశారు.

also read:ఆత్మకూరు ఉప ఎన్నిక: పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

Latest Videos

undefined

దివంగత మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు Vikaram Reddyని బరిలోకి దింపినందున ఈ స్థానంలో పోటీ చేయడం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక విషయమై YCP నేతల సవాళ్ల విషయమై చంద్రబాబు మండిపడ్డారు. Badvel Bypollలో ఎందుకు దూరంగా ఉన్నామో ఆత్మకూరు ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ఎవరికీ కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు చెప్పారు. నీటి పారుదల శాఖ ఇంజనీర్ పై ఎమ్మెల్యే  దాడి విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. 

2021 లో జరిగిన  బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. ఈ స్థానానికి అందరి కంటే ముందుగానే టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. అయితే  బద్వేల్ స్థానం నుండి వైసీపీ ఎమ్మెల్యే  వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో వెంకట సుబ్బయ్య భార్యకు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను కోరింది. దీంతో పోటీ నుండి తప్పుకోవాలని టీడీపీ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకొంది టీడీపీ. సంప్రదాయాలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ వివరించింది.

Nellore జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఈ ఏడాది జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 29న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నిన్ననే విడుదలైంది. జూన్ 6వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.జూన్  9న  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.  ఈ నెల 30న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్ల కోలాహలం మొదలైంది

click me!