పెద్దపల్లి జిల్లా: ఉపాధి హామీ పనులకు కుటుంబం.. ఇంట్లో ఒంటరిగా చిన్నారి, కామాంధుడి ఘాతుకం

Siva Kodati |  
Published : Jun 02, 2022, 04:59 PM IST
పెద్దపల్లి జిల్లా: ఉపాధి హామీ పనులకు కుటుంబం.. ఇంట్లో ఒంటరిగా చిన్నారి, కామాంధుడి ఘాతుకం

సారాంశం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.   

చిన్నారి అన్న కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. పెద్దపల్లి జిల్లాలో (peddapalli district) ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓదెల మండలం ఉప్పరపల్లిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి (rape) పాల్పడ్డాడో కామాంధుడు. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారిపై అతను కన్నేశాడు. అమ్మమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పాప ఒంటరిగా వుందని గమనించిన నిందితుడు ఇదే అదనుగా బెదిరించి అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్ పరారీలో ఉండగా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!