హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. చిలకలగూడలో వృద్దురాలి మెడలో నుంచి బంగారు చైన్‌ను దుండగుడు లాక్కెళ్లాడు.
హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. చిలకలగూడలో వృద్దురాలి మెడలో నుంచి బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లాడు. అయితే ఈ ఘటనలో కిందపడటంతో వృద్దురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అందులో వృద్దురాలితో మాట్లాడుతూ కనిపించిన దుండగుడు.. ఆమె మెడలోని బంగారు గొలసు లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.