మరో వివాదంలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Published : Aug 14, 2018, 12:39 PM ISTUpdated : Sep 09, 2018, 12:23 PM IST
మరో వివాదంలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

సారాంశం

ఆమె కుటుంబసభ్యుల ముందే ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.ఈ వేధింపులు తట్టుకోలేక.. ఆ మహిళా వీఆర్వో ఈ విషయాన్ని వీఆర్వోల సంఘం, టీఎన్‌జీవోల సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లింది.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను వేధించారంటూ.. ఓ మహిళా ఉద్యోగిని తనను ఎమ్మెల్యే వేధించారంటూ కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...జనగామ మండలం పెంబర్తి వీఆర్వోగా పనిచేస్తున్న పద్మ జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడలో నివాసముంటున్నారు. పెంబర్తి సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఓ వెంచర్‌కు సంబంధించిన భూమి విషయంలో ఓ వ్యక్తికి పట్టా చేయాలనే విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఆ మహిళా వీఆర్వో ఇంటికి శనివారం సాయంత్రం వెళ్లి బెదిరించారు.

అయితే.. ఎమ్మెల్యే కోరిన పని చట్టవిరుద్ధంగా ఉండటంతే.. వీఆర్వో అందుకు అంగీకరించలేదు. దీంతో.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఆయన అనుచరులు వీఆర్వో పద్మని బెదిరించడం మరింత తీవ్రతరం చేశారు. అంతేకాకుండా ఆమె కుటుంబసభ్యుల ముందే ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.

 ఈ వేధింపులు తట్టుకోలేక.. ఆ మహిళా వీఆర్వో ఈ విషయాన్ని వీఆర్వోల సంఘం, టీఎన్‌జీవోల సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సహాయంతో కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది.ఈ విషయంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా టీఎన్జీవో సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్