ఆసక్తికరం: రాహుల్‌ మీటింగ్‌కు నారా బ్రహ్మణి

Published : Aug 14, 2018, 12:43 PM ISTUpdated : Sep 09, 2018, 10:50 AM IST
ఆసక్తికరం: రాహుల్‌ మీటింగ్‌కు నారా బ్రహ్మణి

సారాంశం

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి హాజరయ్యారు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి హాజరయ్యారు.

మంగళవారం నాడు హైద్రాబాద్‌‌ తాజ్‌కృష్ణ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశానికి  రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి నారా బ్రహ్మణి కూడ హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

నారా బ్రహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ పుడ్స్  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తల సమావేశానికి  బ్రహ్మణిని కూడ ఆహ్వానించారు. మరో వైపు కర్నూల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్  కూడ  ఈ సమావేశానికి హాజరయ్యారు.

టీజీ భరత్ వచ్చే ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ నిర్వహించిన  సమావేశానికి  వీరిద్దరూ కూడ హాజరుకావడం  ప్రాధాన్యతను సంతరించుకొంది.


 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్