ఈ నెల 28వరకు అసెంబ్లీ: కృష్ణానదిపై ఏపీ ప్రాజెక్టులు, కరోనాపై చర్చకు సర్కార్ ఓకే

By narsimha lodeFirst Published Sep 7, 2020, 4:08 PM IST
Highlights

ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకొంది.సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం జరిగింది.

హైదరాబాద్: ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకొంది.సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం జరిగింది.

ఈ నెల 8వ  తేదీన పీవీ శత జయంతి ఉత్సవాలపై సభలో చర్చ జరగనుంది. కరోనాతో పాటు కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు అంగీకరించింది. 

ఈ నెల 12,13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులను ప్రకటించారు. 17 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

also read:బీఎసీ సమావేశంలో కేసీఆర్, భట్టి విక్రమార్క మధ్య వాడీ వేడీ చర్చ

ప్రతి రోజూ గంట పాటు క్వశ్చన్ అవర్ నిర్వహించనున్నారు. 6 ప్రశ్నలను మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అరగంట పాటు జీరో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బెల్ట్ షాపులు,  పోడు వ్యవసాయం, పాత సచివాలయం  కూల్చివేత, ఎస్సీ, ఎష్టీ సబ్ ప్లాన్, కొత్త విద్యావిధానం, బీసీ సబ్ ప్లాన్ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

click me!