తెలంగాణకు చేరుకొన్న కేంద్ర బృందం: వరద నష్టంపై అంచనా

Published : Oct 22, 2020, 01:01 PM IST
తెలంగాణకు చేరుకొన్న కేంద్ర బృందం: వరద నష్టంపై అంచనా

సారాంశం

 రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తెలంగాణకు కేంద్ర బృందం గురువారం నాడు హైద్రాబాద్ కు వచ్చింది.  


హైదరాబాద్: రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తెలంగాణకు కేంద్ర బృందం గురువారం నాడు హైద్రాబాద్ కు వచ్చింది.

ఈ నెల 13వ తేదీన నగరంలో భారీ వర్షం వచ్చింది. ఈ నెల 17వ  తేదీన కూడ భారీ వర్షం వచ్చింది. దీంతో నగరంలోని పలు కాలనీలు  ఇంకా  వరద నీటిలోనే ఉన్నాయి.

ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశాడు. 

also read:హైద్రాబాద్‌‌లో భారీ వర్షాలు, కూలిన గోల్కోండ గోడ: పురాతన కట్టడాలకు దెబ్బేనా?

రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇవాళ హైద్రాబాద్ కు వచ్చింది. సచివాలయంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర బృందం సమావేశమైంది.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం గురించి కేంద్ర బృందానికి సీఎస్ పూర్తి వివరాలు అందించాడు. రెండు రోజుల పాటు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది.

PREV
click me!

Recommended Stories

Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు