కిడ్నాప్‌కు గురైన గంటలోపే హత్య, ఆ తర్వాతే డబ్బుల డిమాండ్: దీక్షిత్ రెడ్డి హత్యపై ఎస్పీ

By narsimha lodeFirst Published Oct 22, 2020, 11:50 AM IST
Highlights

కిడ్నాప్ చేసిన గంటలోపుగానే దీక్షిత్ రెడ్డిని నిందితుడు గొంతు పిసికి హత్య చేశాడని మహబూబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. బాలుడిని చంపిన తర్వాత డబ్బుల కోసం మందసాగర్ డిమాండ్ చేశారు. 

మహబూబాబాద్:కిడ్నాప్ చేసిన గంటలోపుగానే దీక్షిత్ రెడ్డిని నిందితుడు గొంతు పిసికి హత్య చేశాడని మహబూబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. బాలుడిని చంపిన తర్వాత డబ్బుల కోసం మందసాగర్ డిమాండ్ చేశారు. 

గురువారం నాడు ఉదయం  మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్టుగా ఎస్పీ చెప్పారు. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని చెప్పారు.

also read:దీక్షిత్ కిడ్పాప్ కథ విషాదాంతం: మహబూబాబాద్ శివారులో శవం

అతి త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే దీక్షిత్ రెడ్డిని శనిగపురం గ్రామానికి చెందిన మందసాగర్ కిడ్నాప్ చేశారని పోలీసులు చెప్పారు. మెకానిక్ గా పనిచేస్తున్న మందసాగర్  త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ పనిచేశాడని విచారణలో తేలిందన్నారు.

ఈ వ్యవహరంలో ఇతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే తాను ఒక్కడిని మాత్రమే ఈ దారుణం చేసినట్టుగా ఒప్పుకొన్నాడని ఎస్పీ వివరించారు.

ఈ కేసులో సుమారు 30 మంది అనుమానితులను విచారించినట్టుగా ఎస్పీ చెప్పారు. కిడ్నాపర్ ఉపయోగించిన టెక్నాలజీ ఆధారంగా అతడిని పట్టుకొన్నామని ఆయన వివరించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి ఆ రోడ్డులోనే దీక్షిత్ ను కిడ్నాపర్ తాళ్లపూసలపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లినట్టుగా ఎస్పీ తెలిపారు.

తానే కిడ్నాప్ చేసినట్టుగా బయట పడుతోందనే ఉద్దేశ్యంతో దీక్షిత్ రెడ్డిని చంపాడని ఎస్పీ తెలిపారు. బాలుడిని చంపిన తర్వాత డబ్బుల కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడని ఆయన వివరించారు. దీక్షిత్ రెడ్డి బంధువుల ఊరు శనిగపురం గ్రామం. తరచూ ఈ గ్రామానికి వెళ్లే దీక్షిత్ రెడ్డికి సాగర్ ను గుర్తు పట్టాడని ఎస్పీ చెప్పారు.

బైక్ పై వచ్చి సాగర్ పిలవగానే దీక్షిత్ రెడ్డి అతని బైక్ పై వెళ్లాడని  ఆయన వివరించారు.


 

click me!